Free Bus: మాకు ఉచితం వద్దు.. టికెట్ తీసుకునే వెళ్తాం.. ఖమ్మం మహిళా టీచర్ల తీర్మానం
- ఎం.వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీచర్ల నిర్ణయం
- ఉచిత సౌకర్యాన్ని పేదలు, వృద్ధులకు, కాలేజీ పిల్లలకు వదిలేయాలని నిర్ణయం
- టీచర్ల నిర్ణయంపై ప్రశంసలు
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణాన్ని తాము ఉపయోగించుకోబోమని, తాము టికెట్ తీసుకునే ప్రయాణిస్తామని ఖమ్మం జిల్లా మహిళా ఉపాధ్యాయులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పేదలు ఉపయోగించుకుంటే చాలని, అది వారికి అవసరం కూడా అని వారు పేర్కొన్నారు. తమకు టికెట్ తీసుకుని ప్రయాణంచేంత ఆర్థిక స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ మేరకు అందరూ కలిసి ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోకూడదని తీర్మానం చేసుకున్నారు.