Vande Bharat Train: సొంత నియోజకవర్గం నుంచి మరో వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
- వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ
- పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
- వారణాసి నుంచి ఢిల్లీకి రెండో వందేభారత్ రైలు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో వారణాసి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ సెమీ హైస్పీడ్ రైలుకు మోదీ పచ్చజెండా ఊపారు. అంతేకాదు, కొన్ని గూడ్స్ రైళ్లను కూడా మోదీ ప్రారంభించారు. వారణాసి-ఢిల్లీ మార్గంలో ఇప్పటికే ఒక వందేభారత్ రైలు నడుస్తోంది. ఈ రూట్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో వందేభారత్ ను ప్రవేశపెట్టారు.
తాజాగా ప్రధాని ప్రారంభించిన వందేభారత్ రైలులో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. వైఫై, బయో వాక్యూమ్ టాయిలెట్లు (టచ్ ఫ్రీ), ప్రతి సీటు వద్ద చార్జింగ్ పాయింట్, టచ్ బేస్డ్ రీడింగ్ లైట్లు, జీపీఎస్ తో కూడిన కమ్యూనికేషన్ వ్యవస్థ, డిప్యూజ్డ్ ఎల్ఈడీ లైట్లు పొందుపరిచారు.