Madhavapeddi Sathyam: ఎంత పేరొచ్చినా నాన్నేమీ మారలేదు: మాధవపెద్ది సత్యం తనయుడు మూర్తి
- అలనాటి గాయకుడు మాధవపెద్ది సత్యం
- ఆయన గురించి ప్రస్తావించిన తనయుడు
- తన తండ్రికి ఆడంబరాలు నచ్చవని వెల్లడి
- సింపుల్ గా సైకిల్ పై తిరిగేవారని వివరణ
'వివాహ భోజనంబు .. వింతైన వంటకంబు' అనే పాట ఈ రోజుకీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాట పాడినవారు మాధవపెద్ది సత్యం. అప్పట్లో ఎస్వీ రంగారావుకి ఆయనే పాటలు .. పద్యాలు పాడేవారు. తాజా ఇంటర్వ్యూలో మాధవపెద్ది సత్యం గురించి, ఆయన తనయుడు వెంకటనారాయణమూర్తి మాట్లాడారు.