BJP: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది: బీజేపీ నేత రఘునందనరావు ఆరోపణ
- ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతారని వ్యాఖ్య
- 2008లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాళేశ్వరంపై సమీక్ష జరిగినట్లు వెల్లడి
- నాడు 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రతిపాదన చేశారన్న బీజేపీ నేత
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన రావు ఆరోపించారు. మంగళవారం ఆయన హైదరాబాదులోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతారన్నారు. 2008లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాళేశ్వరంపై సమీక్ష జరిగినట్లు చెప్పారు. నాడు 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రతిపాదన చేశారని వెల్లడించారు. వైఎస్ హయాంలోనే మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టు పెంచేలా మరోసారి ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.