Murali Mohan: మాకంటే ఇప్పటి హీరోలు పడుతున్న కష్టం ఎక్కువ: మురళీమోహన్

Muralimohan Interview

  • నటుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న మురళీ మోహన్ 
  • ఇంత కాలం ఇండస్ట్రీలో ఉంటాననుకోలేదని వ్యాఖ్య 
  • జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ అవసరమని వెల్లడి 
  • తెలుగు సినిమా ఎదిగిపోయిందంటూ హర్షం


మురళీ మోహన్ .. హీరోగా అనేక చిత్రాలలో నటించారు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ వస్తున్నారు. తాజాగా 'మహా మ్యాక్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను కాస్త లేటుగా ఇండస్ట్రీకి వచ్చాను. అందువలన సాధ్యమైనంత వరకూ ఎక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లాను. 10 - 15 ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటే చాలనుకున్నాను. కానీ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటానని మాత్రం అనుకోలేదు" అన్నారు. 

కృషి .. పట్టుదల .. క్రమశిక్షణ చాలా అవసరమని నేను భావిస్తాను. ఎన్టీఆర్ - ఏఎన్నార్ లను చూసి మా తరం నేర్చుకుంది. షూటింగుకి ముందుగానే మేమంతా స్పాట్ లో రెడీగా ఉండేవాళ్లం .. లేదంటే నిర్మాత నష్టపోతాడు. మన వలన నిర్మాత నష్టపోకూడదు అనే ఒక ఆలోచనతో పనిచేశాము. ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోవడం వలన కొంతమంది షూటింగుకి రావడం ఆలస్యమవుతూ ఉండొచ్చు .. అది వేరే విషయం" అని చెప్పారు. 

"మా కంటే .. ఇప్పటి హీరోలు చాలా కష్టపడుతున్నారు. డాన్సులు .. ఫైట్ల కోసం వాళ్లు ఎక్కువ కసరత్తు చేస్తున్నారు. అలాగే డైరెక్షన్ .. ఫొటోగ్రఫీ .. మ్యూజిక్ విషయంలో టెక్నికల్ గా ఎన్నో మార్పులు వచ్చాయి. తెలుగు సినిమా స్థాయి పెరిగిపోవడం వల్లనే, ఇప్పుడు బాలీవుడ్ వాళ్లంతా ఇక్కడి సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు" అని అన్నారు. 

  • Loading...

More Telugu News