danam nagender: కాంగ్రెస్ తమను గెలికి తిట్టించుకుంది: దానం నాగేందర్

Danam Nagender interesting comments on congress
  • శ్వేతపత్రాలను సభలో పెట్టడం ద్వారా కాంగ్రెస్ తమను గెలికిందన్న దానం
  • కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో డిఫెన్స్‌లో పడిందని వ్యాఖ్య
  • ప్రభుత్వ అప్పులు బయటపడితే భవిష్యత్తుకు ఇబ్బంది అన్న దానం
శ్వేతపత్రాలను సభలో పెట్టడం ద్వారా కాంగ్రెస్ తమను గెలికిందని, ఇలా తమను గెలికి తిట్టించుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో డిఫెన్స్‌లో పడిపోయిందన్నారు. వారు ఇచ్చిన హామీలను... పథకాలను ఆలస్యంగా అమలు చేయడానికే శ్వేతపత్రాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ అప్పులు బయటపడితే భవిష్యత్తు ఇబ్బంది అవుతుందని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు, కేటీఆర్‌ల మాటలకు మంత్రుల కౌంటర్లు సరిపోవడం లేదన్నారు.

నీటిపారుదల ప్రాజెక్టులపై హరీశ్ రావు ఉతికి ఆరేస్తున్నారన్నారు. మంత్రులు అసలు విషయాలు మాట్లాడకుండా పైపైన మాట్లాడి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి ఆయన చిరకాల వాంఛ అని, ఆ పదవిని ఆయన అంత ఈజీగా వదులుకోరని వ్యాఖ్యానించారు. ఆయన లక్ష్యం పెట్టుకొని మరీ సీఎం అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్లు రిటైర్ అవుతారని తాను రెండేళ్ల క్రితమే చెప్పానన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయమివ్వాలని కేసీఆర్ చెప్పారని తెలిపారు.
danam nagender
BRS
Congress

More Telugu News