Krishnaveni: రామారావుగారు లాఠీ పట్టుకుని అందరినీ పరిగెత్తించారు: సీనియర్ నటి కృష్ణవేణి

Krishnaveni Interview

  • నిర్మాతగాను కృష్ణవేణికి మంచి పేరు 
  • ఆమె బ్యానర్ తోనే పరిచయమైన ఎన్టీఆర్ 
  • 'మనదేశం' గురించి ప్రస్తావించిన కృష్ణవేణి   


తెలుగు సినిమా తొలినాళ్లలో నటిగా .. గాయనిగా కృష్ణవేణి పేరు తెచ్చుకున్నారు. ఆమె తన సొంత బ్యానర్ పై కొన్ని సినిమాలను నిర్మించారు కూడా. ఒక వైపున స్టూడియో వ్యవహారాలు చూసుకుంటూనే, కథాకథనాలపై దృష్టిపెట్టేవారు. ఎన్టీ రామారావుని 'మనదేశం' సినిమాతో పరిచయం చేసింది .. అక్కినేనికి 'కీలుగుర్రం' సినిమాతో హిట్ ఇచ్చింది ఆమె బ్యానర్ నే. 

కృష్ణవేణి 99 ఏళ్లను పూర్తిచేసుకుని 100 ఏళ్లలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా 'మహా మ్యాక్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " మా కాలంలో ఒక సినిమా షూటింగు జరిగే సమయంలో అందరం కూడా ఒక ఫ్యామిలీ మాదిరిగా ఉండేవాళ్లం. 'మనదేశం' సినిమాలో రామారావుగారు పోలీస్ గా కనిపిస్తారు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయారు" అని అన్నారు. 

"ఆ సినిమాలో రామారావుగారు జనంపై లాఠీ ఛార్జ్ చేయాలి. ఆయన నిజంగానే లాఠీతో వాళ్లను స్టూడియో గేటు వరకూ తరుముతూ వెళ్లారు. 12 ఎకరాలలో నిర్మించిన స్టూడియో అది. అలా పాత్రలోకి వెళ్లిపోతే, ఆయనకి ఇక ఈ ప్రపంచం గురించి తెలిసేది కాదు" అంటూ నవ్వేశారు. పాత్రలోకి లీనమైపోవడమనేది ఆయనకి ఫస్టు సినిమా నుంచే ఉందనే విషయానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవాలి. 

  • Loading...

More Telugu News