Stock Market: నష్టాల్లో ప్రారంభమై లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 359 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 105 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2.27 శాతం పెరిగిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ... ఆ తర్వాత రిలయన్స్, హెచ్డీఎఫ్సీ వంటి ప్రధాన కంపెనీల షేర్లు కొనుగోళ్ల మద్దతుతో రాణించడంతో మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 359 పాయింట్లు లాభపడి 70,865కి చేరుకుంది. నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 21,255కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.27%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.82%), కోటక్ బ్యాంక్ (1.66%), రిలయన్స్  (1.38%), ఎన్టీపీసీ (1.29%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.61%), యాక్సిస్ బ్యాంక్ (-1.34%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.04%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.80%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.73%).   

  • Loading...

More Telugu News