Republic Day: రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు!

France President Immanuel Macron is the chief guest for Republic Day
  • జనవరి 26న జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • వాస్తవానికి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రావాల్సిన బైడెన్
  • వివిధ కారణాల వల్ల రాలేనన్న అమెరికా అధ్యక్షుడు
వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ విచ్చేస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ను ఆహ్వానించినట్టు కేంద్ర అధికారిక వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రావాల్సి ఉంది. అయితే, వివిధ కారణాల వల్ల తాను రాలేనని బైడెన్ చెప్పినట్టు సమాచారం. దీంతో ఫ్రాన్స్ అధ్యక్షుడిని భారత ప్రభుత్వం ఆహ్వానించింది. మరోవైపు ఈ ఏడాది జులైలో ప్యారిస్ లో జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే పరేడ్ కు ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు మెక్రాన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాస్టిల్ డే పరేడ్ కు మోదీ హాజరు కావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావిస్తున్నారని చెప్పారు. 

Republic Day
India
2024
Chief Guest
Immanuel Macron
France
President

More Telugu News