Chandrababu: ఐఆర్ఆర్ కేసు: లిఖితపూర్వక వాదనలను కోర్టులో సమర్పించిన చంద్రబాబు న్యాయవాదులు

Chandrababu advocates files written arguments in AP High Court
  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గా చంద్రబాబు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ అధినేత
  •  నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు
  • ఇరుపక్షాల లిఖితపూర్వక వాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు వెల్లడి
అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే ఇతర రోడ్ల అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేయడంతో తెలిసిందే. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1గా పేర్కొంది. 

ఈ నేపథ్యంలో, చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో సెప్టెంబరులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలను కోర్టుకు సమర్పించారు. 

అటు, సీఐడీ తరఫున ప్రభుత్వ న్యాయవాదులు కూడా లిఖితపూర్వక వాదనలను కోర్టులో దాఖలు చేశారు. ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి ఇరుపక్షాల లిఖితపూర్వక వాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు హైకోర్టు పేర్కొంది. అనంతరం, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
Chandrababu
IRR Case
AP High Court
TDP
CID
YSRCP
Andhra Pradesh

More Telugu News