Hyderabad: హైదరాబాద్‌లో డిటెక్టివ్ మాజీ ఇన్స్‌పెక్టర్ అరెస్ట్
- కిడ్నాప్, దాడి చేశాడనే ఆరోపణలపై మాజీ ఇన్స్‌పెక్టర్ రాజుపై కేసు నమోదు
- ఓ కంపెనీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రాజుకు డబ్బులు ఇచ్చిన ప్రసాద్
- రిజిస్ట్రేషన్ సమయంలో తన అన్న పేరు పెట్టాలని సూచించిన ప్రసాద్
- తాను సూచించిన పేరు పెట్టలేదని... డబ్బులు తిరిగివ్వలేదని దాడి చేసిన ప్రసాద్
- పీఎస్‌లో ఫిర్యాదు చేసిన రాజు... ప్రసాద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
హైదరాబాదులోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ మాజీ ఇన్స్‌పెక్టర్ ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో రాజు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, దాడి చేశాడనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదయింది. దీంతో ప్రసాద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి సీఐ సీతయ్య తెలిపిన వివరాల ప్రకారం... రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజుకు డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ ప్రసాద్ డబ్బులు ఇచ్చారు. ఓ కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్‌లో తన అన్న శేఖర్ పేరు పెట్టాలని సూచించాడు. అయితే రాజు మరో పేరుతో కంపెనీని రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో తాను చెప్పిన పేరు పెట్టకపోవడంతో పాటు డబ్బులు తిరిగి ఇవ్వనందుకు ఆగ్రహించిన ప్రసాద్... రాజుపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.