Taxes: ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం

Center releases taxes devolution to states

  • రాష్ట్రాలకు పన్నుల వాటా రూ.72,961 కోట్ల విడుదల
  • ఏపీకి రూ.2,952 కోట్లు, తెలంగాణకు రూ.1,533 కోట్లు విడుదల
  • అత్యధికంగా ఉత్తరప్రదేశ్ కు రూ.13,088 కోట్లు
  • పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని ముందే విడుదల చేసిన కేంద్రం

రాష్ట్రాలకు పన్నుల్లో వాటాలను విడుదల చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు పన్నుల వాటా రూపేణా రూ.72,961 కోట్లను విడుదల చేసింది. ఏపీకి రూ.2,952 కోట్లు, తెలంగాణకు రూ.1,533 కోట్లు విడుదల చేసింది. కేంద్రం అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.13,088 కోట్లు విడుదల చేసింది.

బీహార్ కు రూ.7,338 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.5,488 కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ.5,727 కోట్లు, మహారాష్ట్రకు రూ.4,609 కోట్లు, రాజస్థాన్ కు రూ.4,396 కోట్లు విడుదల చేసింది. 

వాస్తవానికి ఈ పన్నుల వాటా విడుదల 2024 జనవరి 10న విడుదల చేయాల్సి ఉండగా, పండుగ సీజన్, నూతన సంవత్సరాదిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 11నే నిధులను విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నేడు వెల్లడించింది.

  • Loading...

More Telugu News