Devineni Uma: తల్లిని చూసేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా?: దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు

Devineni Uma and Prathipati Pullarao fires on Jagan
  • ఎన్నారై యశ్ ను సీఐడీ అరెస్ట్ చేయడంపై మండిపాటు
  • సీఐడీ వైసీపీకి ప్రైవేట్ సైన్యంలా పని చేస్తోందని మండిపాటు
  • ఎన్నారైలకు జగన్ ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్న
టీడీపీ ఎన్నారై యశ్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, టీడీపీ నేత ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు వచ్చిన యశ్ ను అరెస్ట్ చేశారని చెప్పారు. 70 ఏళ్ల వయసున్న ఆయన తల్లి ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇలా అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు. యశ్ ను అరెస్ట్ చేయడం ద్వారా లక్షలాది మంది తెలుగు ఎన్నారైలకు జగన్ రెడ్డి ఏం సందేశం ఇస్తున్నారని ఉమా ప్రశ్నించారు. 

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సీఐడీ పోలీసుల తీరు దారుణంగా ఉందని విమర్శించారు. సీఐడీ అధికారులు వైసీపీకి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టులు పదేపదే చెపుతున్నా సీఐడీకి పట్టదా? అని ప్రశ్నించారు.
Devineni Uma
Prathipati Pulla Rao
Telugudesam
Yash

More Telugu News