Prashant Kishor: హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన లోకేశ్, ప్రశాంత్ కిశోర్... కాసేపట్లో చంద్రబాబుతో భేటీ!

Lokesh and Prashant Kishore leaves Gannavaram airport
  • ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం
  • ఒకే వాహనంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిన లోకేశ్, ప్రశాంత్ కిశోర్
  • గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్
ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం అనదగ్గ ఘటన నేడు చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు. వారిద్దరూ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఇద్దరూ ఒకే వాహనంలో వెళ్లారు. ప్రశాంత్ కిశోర్ కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

రాబోయే ఎన్నికల కోసం ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ టీడీపీ అధినాయకత్వంతో భేటీ అవుతుండడం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడం కోసమేనని తెలుస్తోంది. ఇందుకోసం టీడీపీ... ప్రశాంత్ కిశోర్ తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటుందా? అన్నది వేచిచూడాలి.
Prashant Kishor
Nara Lokesh
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News