Revanth Reddy: ఉద్యోగ భద్రత కల్పించండి: రేవంత్ రెడ్డికి గిగ్ వర్కర్ల విజ్ఞప్తి
- రేవంత్ రెడ్డితో భేటీలో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్, ఓలా, ఉబెర్, ఆటో డ్రైవర్లు
- రాష్ట్రవ్యాప్తంగా మూడున్నర లక్షలమంది గిగ్ వర్కర్లు ఉన్నట్లుగా అంచనా
- సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ ఠాక్రే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్లతో సమావేశమయ్యారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్, ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షలమంది... ఆన్ లైన్ యాప్స్, డిజిటల్ ప్లాట్‌ఫాంలపై తాత్కాలికంగా పని చేసే గిగ్ వర్కర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.