Ambati Rambabu: లోకేశ్, ప్రశాంత్ కిశోర్ కలిసి ఏపీకి రావడంపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్

Ambati Rambabu satires on Lokesh and Prashant Kishor
  • హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో విజయవాడకు లోకేశ్, ప్రశాంత్ కిశోర్
  • ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పయనం
  • చంద్రబాబుతో సమావేశమైన ప్రశాంత్ కిశోర్
  • మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలడంటూ అంబటి వ్యంగ్యం
ఏపీ రాజకీయాల్లో నేడు అత్యంత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ యువనేత నారా లోకేశ్, ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో విజయవాడ రావడం, ఒకే వాహనంలో ఇరువురు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడం, ఆపై చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, లోకేశ్ తో ప్రశాంత్ కిశోర్ అంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. 

మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడు? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ పీకే (పవన్ కల్యాణ్) వచ్చినా, ఈ పీకే (ప్రశాంత్ కిశోర్) వచ్చినా ఏపీలో టీడీపీని గెలిపించడం కష్టమని అభిప్రాయపడ్డారు. టీడీపీ ఇప్పటికే చచ్చిన పార్టీ అని, ప్రశాంత్ కిశోర్ వచ్చి ఏమైనా పోస్టుమార్టం చేయగలరేమో కానీ... టీడీపీ గెలవడం అసాధ్యం అని వ్యాఖ్యానించారు.
Ambati Rambabu
Nara Lokesh
Prashant Kishor
Chandrababu
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News