Cricket: వన్డేల్లో అత్యధిక మ్యాచ్ ఫీజులు పొందిన టాప్ 10మంది క్రీడాకారులు వీరే
- ఈ ఏడాది వన్డేల్లో మంచి ట్రాక్ రికార్డు కనబరిచిన టీమిండియా
- 35 వన్డేలు ఆడగా అందులో 27 విజయాలు, ఒకటి డ్రా
- రూ.1.80 కోట్ల మ్యాచ్ ఫీజుతో ఈ ఏడాది నెం.1గా నిలిచిన కుల్దీప్ యాదవ్
ఈ ఏడాది వన్డేల్లో భారత్ గొప్ప విజయాల్నే అందుకుంది. టీమిండియా మొత్తం 35 వన్డేలు ఆడగా అందులో 27 విజయాలను సొంతం చేసుకుంది. ఒకటి డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో క్రీడాకారులకు కూడా భారీగా పారితోషికాలు అందాయి. టీం తరపున ఆడిన ఒక్కో క్రీడాకారుడికి బీసీసీఐ రూ. 6 లక్షల మ్యాచ్ ఫీజు చెల్లిస్తుంది. దీంతో, ఈ ఏడాది 30 వన్డేలు ఆడిన కుల్దీప్ యాదవ్ మొత్తం రూ.1.80 కోట్లు పారితోషికం కింద తీసుకున్నాడు. మొత్తం 49 వికెట్లతో ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
- కుల్దీప్ యాదవ్ - రూ.1.80 కోట్లు
- శుభ్మాన్ గిల్ - రూ.1.74 కోట్లు
- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ - రూ. 1.62 కోట్లు
- రవీంద్ర జడేజా - రూ. 1.56 కోట్లు
- మహమ్మద్ సిరాజ్- రూ. 1.50 కోట్లు
- సూర్యకుమార్ యాదవ్ - రూ. 1.26 కోట్లు
- శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్య -1.20 కోట్లు
- మహ్మద్ షమీ - రూ.1.14 కోట్లు
- జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ - రూ. 1.02 కోట్లు
- శార్దూల్ ఠాకూర్ - రూ. 96 లక్షలు