V.C. Sajjanar: నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందన

Sajjanar responds to video of girl dancing on road
  • షార్ట్స్ వీడియో కోసం నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన యువతి
  • కొన్ని రోజులుగా నెట్టింట ట్రెండింగ్‌లో వీడియో
  • ఘటనపై తాజాగా స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
  • యువత షార్ట్స్ పిచ్చిలో జీవితాలను నాశనం చేసుకోవడం బాధాకరమని వ్యాఖ్య
షార్ట్ వీడియోతో పాప్యులర్ అయిపోవాలనే తపనతో ఇటీవల ఓ యువతి నడిరోడ్డుపై డ్యాన్స్ చేసి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యువతి తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న తరుణంలో తాజాగా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కూడా స్పందించారు. యువతలో ఈ పెడధోరణులు విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాప్యులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనందమో.. ఏమో!?’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
V.C. Sajjanar
Viral Videos

More Telugu News