Plane Grounded in France: సస్పెన్స్‌కు తెర.. ఫ్రాన్స్ నుంచి ముంబైకి చేరుకున్న భారతీయుల విమానం

Indians stuck in French airport for human trafficking probe reach Mumbai 27 seek asylum in France
  • మానవ అక్రమరవాణా అనుమానాలపై ఫ్రాన్స్‌లో నిలిచిపోయిన ‘భారతీయుల’ విమానం
  • ఘటనపై ఫ్రాన్స్ విచారణ అనంతరం విమానం భారత్‌కు పంపించేందుకు అనుమతి
  • మంగళవారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్న విమానం
  • ఫ్రాన్స్ ఆశ్రయం కోరి అక్కడే ఉండిపోయిన 27 మంది ప్రయాణికులు
ఫ్రాన్స్‌లో కొన్ని రోజుల పాటు చిక్కుకుపోయిన భారతీయులు ఎట్టకేలకు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. మానవ అక్రమ రవాణా అనుమానాలతో ఫ్రాన్స్‌లో నాలుగు రోజుల పాటు నిలిచిపోయిన విమానం నేడు భారతీయులతో స్వదేశానికి చేరుకుంది. పారిస్‌లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30కు బయలుదేరిన విమానం ఈ తెల్లవారుజామున 4.00 గంటలకు ముంబైలో దిగింది. 

మొత్తం 276 మంది ప్రయాణికులు భారత్‌కు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారని ఫ్రాన్స్ వర్గాలు తెలిపాయి. ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 27 మంది ఫ్రాన్స్‌‌లోనే ఉండిపోయారని పేర్కొన్నాయి. వారు ఫ్రాన్స్‌లో శరణార్థులుగా ఆశ్రయం కోరినట్టు తెలిపాయి. 
  
అసలేం జరిగిందంటే.. 
దుబాయ్ నుంచి 303 మంది భారతీయులతో నికరాగ్వాకు బయలుదేరిన ఓ చార్టర్ విమానం శుక్రవారం ఫ్రాన్స్‌లోని వాట్రీ ఎయిర్‌పోర్టులో ఇంధనం కోసం దిగింది. అయితే, మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానంతో అధికారులు విమానాన్ని ఎయిర్‌పోర్టులోనే నిలువరించారు. నికరాగ్వా నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాన్స్ అధికారులు విమానంలోని భారతీయులను  నాలుగు రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో కొందరు ఫ్రాన్స్‌ ఆశ్రయం కోరగా మిగతా వారురిని తాజాగా భారత్‌లో దిగారు.కు పంపించారు.  
Plane Grounded in France
India
France
Mumbai

More Telugu News