Vangaveeti Ranga: విజయవాడలో తన తండ్రి వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమానికి హాజరు కాని రాధా.. కారణం ఇదే!

This is the reason why Vangaveeti Radha not attended Vangaveeti Ranga vardhanthi
  • ఈ రోజు వంగవీటి రంగా వర్ధంతి
  • విజయవాడ బందరు రోడ్డులోని రంగా విగ్రహానికి నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు, అభిమానులు
  • కాశీలో తండ్రి తర్పణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాధా
ఈరోజు వంగవీటి రంగా వర్ధంతి. ఈ సందర్భంగా విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న రంగా విగ్రహానికి ఆయన అభిమానులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రంగా కూతురు ఆశా, రాధా భార్య పుష్పవల్లి కూడా పాల్గొన్నారు. వంగవీటి రాధా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. 

ఈ కార్యక్రమానికి రాధా ఎందుకు హాజరుకాలేదో ఆయన సోదరి ఆశా వివరించారు. కాశీలో తన తండ్రి రంగా తర్పణం కార్యక్రమాన్ని రాధా నిర్వహిస్తున్నారని.... ఆయన కాశీలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిపారు. రంగా అభిమానులంతా తమ కుటుంబ సభ్యులేనని చెప్పారు. రంగా వర్ధంతి నేపథ్యంలో ఈరోజు రాజకీయాలు మాట్లాడటం సరికాదని అన్నారు. 

Vangaveeti Ranga
Vangaveeti Radha
Vardhanthi
Vijayawada

More Telugu News