Narendra Modi: యూట్యూబ్ లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

Modi creates history by reaching 2 crore subscribers mark in Youtube
  • ప్రధాని మోదీ యూట్యూబ్ చానల్ కు 2 కోట్ల సబ్ స్క్రైబర్లు
  • ప్రపంచంలో మరే నేతకు దక్కని ఘనత మోదీ సొంతం
  • సోషల్ మీడియాలో ఎదురులేని నేతగా కొనసాగుతున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. ఆయనకు ఎక్స్ లో 94 మిలియన్లు, ఫేస్ బుక్ లో 48 మిలియన్లు, 82.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలో మరే నేతకు ఈ స్థాయిలో ఫాలోవర్లు లేరు. 

ప్రముఖ వీడియో పబ్లిషింగ్ వేదిక యూట్యూబ్ లోనూ మోదీ దూసుకుపోతున్నారు. తాజాగా యూట్యూబ్ లో ఆయన చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకున్న వారి సంఖ్య 2 కోట్ల మార్కును చేరుకుంది. తద్వారా మోదీ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. యూట్యూబ్ లో రెండు కోట్ల సబ్ స్క్రైబర్లను పొందిన తొలి ప్రపంచనేతగా మోదీ చరిత్ర సృష్టించారు. 

మోదీ ఇప్పటివరకు తన యూట్యూబ్ చానల్లో 23 వేల వీడియోలు పోస్టు చేశారు. దాదాపు ప్రతి వీడియోకు వ్యూస్ వేలల్లో ఉంటాయి.
Narendra Modi
Youtube
Subscribers
Social Media
India

More Telugu News