Sabarimala: డిసెంబర్ 27న శబరిమల ఆలయం మూసివేత.. డిసెంబర్ 30న పునర్దర్శనం

Sabarimala temple to be closed on december 27
  • డిసెంబర్ 27 రాత్రి 11.00 గంటలకు ఆలయద్వారాల మూసివేత
  • మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ డిసెంబర్ 30న తెరుచుకోనున్న శబరిమల
  • జనవరి 16న సాయంత్రం 6:36:45 గంటలకు జ్యోతి దర్శనం
  • మకరవిళక్కు మహత్వష్టం తరువాత జనవరి 20న ఆలయం మూసివేత
శబరిమల దేవాలయం తలుపులను డిసెంబర్ 27న రాత్రి 11.00 గంటలకు మూసివేయనున్నారు. ఆ తరువాత మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం ద్వారాలను డిసెంబర్ 30న సాయంత్రం 5.00 గంటలకు తెరుస్తారు. మకరవిళక్కు (జ్యోతి దర్శనం) వచ్చే ఏడాది జనవరి 16న సాయంత్రం (6:36:45) కలుగుతుంది. మకర విళక్కు మహత్వష్టం (2024) పూర్తయ్యాక శబరిమల సన్నిధానం జనవరి 20న ఉదయం 6.30కు మూసేస్తారు. ఆ తరువాత భక్తుల దర్శనానికి అనుమతించరు. 

శబరిమల ఆలయంలో 41 రోజుల పాటు మండల పూజలు జరిగాయి. డిసెంబర్ 27న మండల పూజ ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 11 గంటలకు స్వామి వారి ఆలయాన్ని మూసేస్తారు. మండల పూజల ముగింపు తరువాత మకరజ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఉత్సవాల కోసం శబరిమల సన్నిధానాన్ని తెరుస్తారు. వచ్చే ఏడాది జనవరి 15న మకరవిళక్కు పూజలు నిర్వహిస్తారు. కాగా, మకరవిళక్కు పూజలకు భక్తులు ఆలయానికి పోటెత్తే అవకాశం ఉండటంతో అధికారులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Sabarimala
Kerala

More Telugu News