Beggars Donation: అయోధ్య రామాలయానికి విరాళం ఇచ్చిన వారణాసి యాచకులు

Beggars donate to Ayodhya Ram Temple

  • కాశీ ప్రావిన్స్‌లోని 27 జిల్లాల్లోగల యాచకుల విరాళం 
  • ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న సమర్పణ్ నిధి క్యాంపెయిన్‌కు రూ. 4.5 లక్షల అందజేత
  • 300 మంది యాచకులు విరాళమిచ్చినట్టు చెప్పిన ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యకర్త

వారణాసికి చెందిన యాచకులు అయోధ్య రామాలయానికి రూ. 4.5 లక్షలను విరాళంగా ఇచ్చారు. తద్వారా ఆలయ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలన్న చిరకాల వాంఛ తీర్చుకున్నారు. 

ఆలయ నిర్మాణం కోసం ఆర్ఎస్ఎస్ సంస్థ సమర్పణ్ నిధి క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో 2020 నవంబర్‌లో కాశీలోని కొందరు యాచకులు ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించి తమ మనసులో మాట బయటపెట్టారు. తొలుత అధికారులు సంశయించినా యాచకుల విజ్ఞప్తి మేరకు విరాళం స్వీకరించేందుకు అంగీకరించారు. కాశీ ప్రావిన్స్‌లోని 27 జిల్లాల భక్తులు ఈ విరాళం అందించారు. కాశీకి చెందిన మొత్తం 300 మంది యాచకులు విరాళం ఇచ్చారని ఆర్ఎస్ఎస్‌కు చెందిన మురళి పాల్ తెలిపారు. 

ఈ సందర్భంగా బైద్యనాథ్ అనే యాచకుడు మాట్లాడుతూ తాను 30 ఏళ్ల క్రితం అనారోగ్యం బారిన పడి ఏ పనీ చేయలేని స్థితికి చేరుకున్నట్టు తెలిపారు. నాటి నుంచీ యాచకవృత్తితోనే పొట్టపోసుకుంటున్నట్టు తెలిపాడు. అయోధ్య రామాలయం కోసం నిధుల సేకరణ విషయం తెలియగానే తామూ పాలుపంచుకోవాలని నిర్ణయించినట్టు తెలిపాడు. జనవరి 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతానని కూడా తెలిపాడు. మరోవైపు, వేల మంది చెప్పులు కుట్టేవాళ్లు, స్వీపర్లు కూడా రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు.

  • Loading...

More Telugu News