Asaduddin Owaisi: రేవంత్ రెడ్డికి, సీఎస్ శాంతికుమారికి అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి

Asaduddin Owaisi appeal to CM Revanth Reddy and CS Shanthi Kumari
  • ప్రజాపాలన దరఖాస్తులు ఉర్దూ భాషలోనూ ఉండేలా చూడాలన్న అసదుద్దీన్
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందాలన్న మజ్లిస్ అధినేత
  • అందుకే దరఖాస్తులు ఉర్దూలో ఉండాలని సూచన
ప్రజాపాలన దరఖాస్తులు ఉర్దూ భాషలోనూ ఉండేవిధంగా చూడాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందేలా చూడాలని... ఇందులో భాగంగా దరఖాస్తులు ఉర్దూలో అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి, సీఎస్ శాంతికుమారికి ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు గ్యారంటీలలోని కొన్నిటిని అమలు చేస్తోంది. మిగతా హామీల అమలుకు రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులను స్వీకరిస్తోంది.
Asaduddin Owaisi
MIM
Congress
Revanth Reddy

More Telugu News