Priyanka Gandhi: మనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో ప్రియాంక గాంధీ పేరు

ED Files chargesheet in money laundering case with Priyanka Gandhi name
  • అమీన్‌పూర్ భూముల కొనుగోలు చేసిన రాబర్ట్ వాద్రా
  • కొన్నేళ్ల తర్వాత అమ్మిన వ్యక్తికే భూముల విక్రయం
  • ఈ లావాదేవీల్లో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయని ఈడీ ఆరోపణ
ఎన్నారై వ్యాపారవేత్త సీపీ థంపి, బ్రిటన్ జాతీయుడు సుమిత్ చద్దాపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను ఈడీ చేర్చింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రాబర్ట్ వాద్రా 2006లో ఫరీదాబాద్‌లోని అమీన్‌పూర్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 2010లో తిరిగి ఆయనకే దానిని విక్రయించారు. అలాగే, అదే ఏడాది అదే గ్రామంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి 2010లో తిరిగి దానిని పహ్వాకే అమ్మేశారు. ఈ భూముల క్రయవిక్రయాలు ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయని, అవసరమైన నిధులు థంపి, సుమిత్ చద్దా ద్వార వచ్చినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చార్జ్‌షీట్‌లో వారి పేర్లు చేర్చింది.
Priyanka Gandhi
Robert Vadra
Congress
ED
Money Laundering

More Telugu News