Vijaykanth: విజయకాంత్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్

CM Jagan express shock over the demise of Vijaykanth
  • గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్
  • ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
  • మరోసారి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిక
  • తాజాగా కరోనా నిర్ధారణ
  • చికిత్స పొందుతూ మృతి
సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని వారాలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. కొద్దిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినా, మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. విజయకాంత్ కు తాజాగా కరోనా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, విజయకాంత్ మృతిపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ కుటుంబానికి, ఆయన అభిమానులకు, డీఎండీకే పార్టీ కార్యకర్తలకు సంతాపం తెలియజేశారు.
Vijaykanth
Demise
CM Jagan
Kollywood
Tamil Nadu
Andhra Pradesh

More Telugu News