Vijaykanth: విజయకాంత్ మృతిపై చంద్రబాబు స్పందన
- కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్
- తాజాగా కరోనా సోకినట్టు నిర్ధారణ
- చెన్నైలో చికిత్స పొందుతూ కన్నుమూత
అసలే తీవ్ర అనారోగ్యం, దానికి తోడు కరోనా సోకడంతో ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ కోలుకోలేకపోయారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విజయకాంత్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ ఇక లేరన్న వార్త తెలిసి తీవ్ర విచారం కలిగిందని పేర్కొన్నారు. విజయకాంత్ కుటుంబానికి, ఆయన సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.