Liberia: లైబీరియాలో ఘోర ప్రమాదం... లీకవుతున్న పెట్రోల్ కోసం వెళ్లి 40 మంది దుర్మరణం

Petrol Tanker explodes as 40 people died in Liberia
  • టొటోటా పట్టణం వద్ద ఘటన
  • రోడ్డు పక్కన బోల్తా పడిన చమురు ట్యాంకర్
  • పెట్రోల్ పట్టుకునేందుకు ఎగబడిన స్థానికులు
  • ఒక్కసారిగా పేలిపోయిన ట్యాంకర్
ఆఫ్రికా దేశం లైబీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన బోల్తా పడిన ఓ చమురు ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీకవుతుండడంతో, ఆ పెట్రోల్ ను క్యాన్లలో పట్టుకునేందుకు వెళ్లిన 40 మంది మృత్యువాతపడ్డారు. 80 మందికి పైగా గాయపడినట్టు భావిస్తున్నారు. స్థానికులు పెట్రోల్ పట్టుకుంటున్న సమయంలో ట్యాంకర్ ఒక్కసారిగా పేలడంతో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే కాలిబూడిదయ్యారు. లైబీరియాలోని టొటోటా పట్టణం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. భారీ సంఖ్యలో దుర్మరణం పాలవడంతో టొటోటా పట్టణంలో విషాదం నెలకొంది.
Liberia
Petrol Tanker
Explosion
Totota

More Telugu News