Plane Stuck: బీహార్ లో బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం

Ex Air India scrap plane gets stuck under bridge in Bihar
  • ట్రక్కులో ముంబై తరలిస్తుండగా ఘటన
  • సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం
  • ట్రక్కు టైర్లలో గాలి తీసి బయటకు తెచ్చిన అధికారులు 
ఎయిర్ ఇండియాకు చెందిన పాత విమానాన్ని ముంబై తరలిస్తుండగా బ్రిడ్జి కింద చిక్కుకుంది. స్క్రాప్ చేసిన ఈ విమానాన్ని ట్రక్కుపై ముంబైకి తీసుకెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఆగిన ట్రక్కు.. దానిపై పాత విమానం ఉండడంతో సెల్ఫీల కోసం జనం ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసోం నుంచి ఈ విమానాన్ని ట్రక్కుపై తీసుకెళుతుండగా బీహార్ లోని మోతిహారి దగ్గరున్న ఓ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. బ్రిడ్జి చిన్నగా ఉండడంతో ట్రక్కు ముందుకు వెళ్లడం సాధ్యం కాలేదు. వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా కుదరలేదు. దీంతో రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ సిబ్బంది.. విమానం ఉన్న ట్రక్కు టైర్లలో గాలిని తగ్గించారు. ఎత్తు కాస్త తగ్గడంతో ట్రక్కు బయటపడింది. అనంతరం తిరిగి టైర్లలో గాలిని నింపిన అధికారులు.. ట్రక్కును విమానంతో సహా అక్కడి నుంచి తరలించారు.
Plane Stuck
Under Bridge
Bihar
Scrap Plane
Ex Air India
Plane
Traffic
Motihari

More Telugu News