Babar Azam: నీకు దండంరా బాబూ.. నువ్వే బ్యాటింగ్ చెయ్!.. బాబర్ ఆజంతో స్టీవ్ స్మిత్.. వీడియో ఇదిగో!

Steve Smith Forced To Fold Hands In Epic Banter With Babar Azam
  • రెండో టెస్టులో పాకిస్థాన్‌పై 79 పరుగుల తేడాతో ఆసీస్ విజయం
  • ముందు బ్యాటింగ్ చెయ్ అంటూ బాబర్‌పై స్మిత్ సెటైర్
  • బ్యాట్ చేతికి అందించి నువ్వే చెయ్ అన్న బాబర్
పాకిస్థాన్‌తో మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో విజయం సాధించి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలచుకున్న ఆసీస్ జట్టు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.  మ్యాచ్ సందర్భంగా పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మధ్య ఆసక్తికర ఘటన జరిగింది. నిన్న టీ బ్రేక్ తర్వాత ఆట ప్రారంభం కాగా బాబర్ క్రీజులోకి వచ్చి బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. 

అదే సమయంలో వెనక కీపర్ పక్కనే నిల్చున్న స్మిత్.. సర్దుకోవడం తర్వాత ముందు బ్యాటింగ్ చెయ్.. అన్న అర్థంలో బాబర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. బాబర్ క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండానే స్పందించాడు. చేతిలోని బ్యాట్‌ను స్మిత్‌కు అందిస్తూ..‘నువ్వు బ్యాటింగ్ చెయ్’ అని కౌంటర్ ఇచ్చాడు. బదులుగా స్మిత్ రెండుచేతులు జోడించి దండంపెడుతూ ‘నువ్వే చేసుకో’ అన్నట్టు ముఖం పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Babar Azam
Steve Smith
Australia
Pakistan
Viral Videos

More Telugu News