KTR: దిస్ ఈజ్ నెక్స్ట్ లెవల్: జర్మనీ ట్రక్ ట్రయల్ రన్‌ను ట్వీట్ చేసిన కేటీఆర్
- 32 సెకండ్ల వీడియోను షేర్ చేసిన కేటీఆర్
- ఈ-హైవే టెస్ట్ ట్రాక్‌ను ప్రారంభించిన సీమెన్స్
- త్వరలో ట్రక్కులు కాలుష్యరహితం కానున్నాయని పేర్కొన్న వీడియో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... జర్మనీలో వెహికిల్ ఎలక్ట్రికల్ ట్రయల్ రన్ వీడియోను షేర్ చేస్తూ 'ఇది నెక్స్ట్ లెవల్' అంటూ రీ-ట్వీట్ చేశారు. ఈ వీడియోను తన్సు యెజెన్ అనే జర్మన్ ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ దిస్ ఈజ్ నెక్స్ట్ లెవల్ అని కితాబునిచ్చారు. 32 సెకండ్ల ఈ వీడియోలో... జర్మనీలో వాహనాల ఎలక్ట్రికల్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లుగా ఉంది.
ప్రముఖ ఇంజినీరింగ్ కంపెనీ సీమెన్స్ ఈ-హైవే టెస్ట్ ట్రాక్‌ను ప్రారంభించిందని... దీంతో త్వరలో ట్రక్కులు కాలుష్యరహితంగా మారనున్నాయని ఈ వీడియో పేర్కొంది. అంటే ఇప్పుడు మన రైళ్ల మాదిరిగా ఉంటుంది. రైళ్లు విద్యుత్‌తో నడుస్తున్నట్లుగా... జర్మనీలో ఇక ట్రక్కులు కూడా ప్రత్యేక పవర్ ట్రాక్‌లలో విద్యుత్‌తో నడుస్తాయి. ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ వీడియోను కేటీఆర్ రీ-ట్వీట్ చేశారు.