Atchannaidu: బీటెక్ రవికి భద్రత పునరుద్ధరించండి: డీజీపీకి లేఖ రాసిన అచ్చెన్నాయుడు
- నిన్న బీటెక్ రవి గన్ మన్లను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
- ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీటెక్ రవి కాన్వాయ్ పై దాడి జరిగిందన్న అచ్చెన్నాయుడు
- బీటెక్ రవికి ప్రాణహాని, ఆస్తినష్టం జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టీకరణ
పులివెందుల టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గన్ మన్ల తొలగింపు వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు.
బీటెక్ రవికి తొలగించిన భద్రతను పునరుద్ధరించాలని అచ్చెన్నాయుడు తన లేఖలో కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీటెక్ రవి కాన్వాయ్ పై దాడి జరిగిందని తెలిపారు. బీటెక్ రవికి ప్రాణహాని, ఆస్తి నష్టం జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 2006 నుంచి బీటెక్ రవికి సెక్యూరిటీ కొనసాగుతోందని, ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్థితుల్లో గన్ మన్లను తొలగించడం తగదని పేర్కొన్నారు. నిన్న బీటెక్ రవికి ప్రభుత్వం గన్ మన్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.