Jude Bellingham: క్రికెట్ ఆస్వాదిస్తున్న రియల్ మాడ్రిడ్ ప్లేయర్ జూడ్ బెలింగ్‌హామ్.. వీడియో ఇదిగో!

Real Madrid Star Jude Bellingham Playing Cricket Here Is The Video
  • స్పెయిన్‌లో వింటర్ సీజన్ నుంచి బ్రేక్ కోసం కుటుంబంతో కలిసి ఇంగ్లండ్‌కు జూడ్ బెలింగ్‌హామ్
  • 21 మ్యాచుల్లో 17 స్ట్రైక్‌ల‌తో శక్తిమంతమైన గోల్ స్కోరర్‌గా ఎదిగిన వైనం
  • క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేసిన రియల్ మాడ్రిడ్ మిడ్ ఫీల్డర్
రియల్ మాడ్రిడ్ స్టార్ ఆటగాడు, ఇంగ్లండ్‌ మిడిల్‌ఫీల్డర్ జూడ్ బెలింగ్‌హామ్ క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ సమ్మర్‌లో జర్మన్ క్లబ్ బోరుస్సియా డార్ట్‌మండ్ నుంచి స్పానిష్ రాజధానికి మారినప్పటి నుంచి జీవితాన్ని ఆస్వాదిస్తున్న జూడ్ 21 మ్యాచుల్లో 17 స్ట్రైక్‌లు సాధించి శక్తిమంతమైన గోల్ స్కోరర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం 13 గోల్స్‌తో స్పెయిన్‌కు చెందిన లాలిగాలో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. పునరాగమనం సమయంలో చిరకాల ప్రత్యర్థి బార్సిలోనాపై అద్భుత విజయాన్ని అందించిపెట్టాడు.

స్పెయిన్‌లో వింటర్ సీజన్ నుంచి బ్రేక్ కోసం కుటుంబంతో ఇంగ్లండ్ చేరుకున్న ఈ రియల్ మాడ్రిడ్ ప్లేయర్ జనవరి 3న జరగనున్న తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. 20 ఏళ్ల జూడ్ తాజాగా క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. బ్యాటింగ్‌లో స్ట్రోక్ ప్లే‌తో ఆకట్టుకున్నాడు. ఇదే వీడియోను తన ఇన్‌స్టా వీడియోలో షేర్ చేశాడు. కాగా, ఈ నెల మొదట్లో ‘గోల్డెన్ బాయ్ అవార్డు’ అందుకున్న జూడ్ ఆ ఘనత సాధించిన తొలి రియల్ మాడ్రిడ్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
Jude Bellingham
Real Madrid
Cricket
Instagram
Viral Videos

More Telugu News