Dwaraka: ద్వారక నగర సందర్శన కోసం సబ్ మెరైన్ టూరిజం... గుజరాత్ ప్రభుత్వం కొత్త ఆలోచన

Gujarat govt plans to takes up submarine tourism to show up sunken Dwaraka city

  • భాగవతం ప్రకారం... సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరం
  • ద్వారక నగరాన్ని పర్యాటకులకు చూపించేలా గుజరాత్ ప్రణాళిక
  • మజగావ్ డాక్ షిప్ యార్డ్ తో ఒప్పందం

శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుడ్ని చంపడం.... కంసుడికి పిల్లనిచ్చిన మామ జరాసంధుడు మధురా నగర యాదవులపై పగబట్టడం... దాంతో శ్రీకృష్ణుడు యావత్ మధురా నగరాన్ని సౌరాష్ట్ర (గుజరాత్) తీరానికి తరలించడం భాగవతంలో పొందుపరిచారు. పశ్చిమ తీరంలో ద్వారక నగరాన్ని నిర్మింపజేసిన శ్రీకృష్ణుడు యాదవ మహాసామ్రాజ్యాన్ని పునరుద్ధరించాడు. 

శ్రీకృష్ణుడు అవతారం చాలించాక ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. అయితే, పరిశోధకులు అరేబియా సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగర ఆనవాళ్లను గుర్తించారని కొన్నాళ్ల కిందట కథనాలు వచ్చాయి. 

ఇప్పుడా సముద్ర గర్భంలోని ద్వారక నగరాన్ని పర్యాటకులకు చూపించాలని గుజరాత్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. పర్యాటకులను సబ్ మెరైన్ల సాయంతో ద్వారక నగరం వద్దకు తీసుకెళ్లాలన్నది గుజరాత్ సర్కారు ప్రణాళిక. ఈ మేరకు ముంబయిలోని ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ మజగావ్ డాక్ షిప్ యార్డ్ కంపెనీతో గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

  • Loading...

More Telugu News