Indian Railways: ఆలస్యంగా నడుస్తున్న 26 రైళ్లు.. మీరెళ్లే రైలు కూడా ఉందేమో చూసుకోండి!

Railway services take a hit as 26 trains delayed due to dense fog in Delhi
  • ఉత్తరభారతాన్ని కమ్మేసిన పొగమంచు
  • ప్రతి రోజు ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
  • నేడు కొన్ని రైళ్లు 6 గంటల ఆలస్యం
  • మరో వారం రోజులపాటు ఇదే తీరు
ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు ప్రభావం 26 రైళ్లపై పడిందని, అవన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ తొలి రోజైన నిన్న కూడా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. డిసెంబరు 31న ఢిల్లీలో విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో 23 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 

పొగమంచు కారణంగా నేడు కొన్ని రైళ్లు ఏకంగా ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే పేర్కొంది. కాగా, ఈ వారమంతా వాతావరణం ఇలానే ఉంటుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు 10 నుంచి 7 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది.

రద్దైన రైళ్లు ఇవే..

Indian Railways
Dense Fog
Delhi
North India

More Telugu News