Anitha: విశాఖలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే మహిళా కమిషన్ ఏం చేస్తోంది?: వంగలపూడి అనిత

TDP leader Anitha slams women commission on Vizag incident
  • విశాఖలో ఒడిశా బాలికపై గ్యాంగ్ రేప్
  • మహిళా కమిషన్ ను నిలదీసిన అనిత
  • బాధితురాలిని పరామర్శించే తీరిక లేదా? అంటూ ఆగ్రహం 
విశాఖలో ఓ బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడిన ఘటనపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో స్పందించారు. విశాఖలో గ్యాంగ్ రేప్ జరిగితే మహిళా కమిషన్ ఏంచేస్తోందని ప్రశ్నించారు. కనీసం బాధితురాలిని పరామర్శించే తీరిక కూడా లేదా? అని నిలదీశారు. "గ్యాంగ్ రేప్ ఘటనను పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? విశాఖ పోలీస్ కమిషనర్ ఇంతవరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? బాధితురాలు ఆసుపత్రిలో ఉందని ఒకసారి... లేదు, ఆమెను డిశ్చార్జి చేశారని మరోసారి ఎందుకు చెప్పారు?" అని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Anitha
State Women Commission
Vizag
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News