Leopard: పరిగెత్తుకుంటూ వచ్చి అపార్ట్‌మెంట్ మెట్లు ఎక్కి లోపలికి చొరబడిన చిరుత.. వీడియో ఇదిగో

Leopard Enters House In Narsinghapur Village Haryana
  • హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘటన
  • నర్సింగాపూర్ గ్రామంలో రోడ్డుపక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి చిరుత
  • పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అటవీ, పోలీసులు అధికారులు
వన్యప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలి కాలంలో అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లోకి రావడం పరిపాటిగా మారింది. అలా వచ్చిన వాటిలో కొన్ని గ్రామస్థుల చేతిలో చిక్కి మరణిస్తుంటే, మరికొన్ని ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వాటిని అటవీశాఖ అధికారులు కష్టపడి పట్టుకుని తిరిగి అడవుల్లో వదిలిపెడుతున్నారు.

తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. నర్సింగాపూర్ గ్రామంలోకి చొరబడిన ఓ చిరుత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఓ అపార్ట్‌మెంట్ మెట్లు ఎక్కి పైకి చేరుకుంది. ఆ తర్వాత కాసేపటికే అది కిందికి రావడం అక్కడ అమర్చిన సీసీటీవీల్లో రికార్డయింది. విషయం తెలిసిన ప్రజలు భయంతో బిక్కచచ్చిపోయారు. సమాచారం అందుకున్న అటవీ, పోలీసు అధికారులు వలలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దానిని బంధించే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబరులో పూణెలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన చిరుతను అటవీ అధికారులు చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు.
Leopard
Haryana
Gurugram
Narsinghpur

More Telugu News