Revanth Reddy: మోదీతో... అదానీతో సీఎం రేవంత్ రెడ్డి: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్య

KTR interesting comments on Revanth Reddy
  • ప్రధాని మోదీతో, కరణ్ అదానీతో రేవంత్ రెడ్డి సమావేశాలు
  • మీటింగ్ విత్ ప్రధాని... బిజినెస్ విత్ అదానీ అంటూ క్రిషాంక్ ట్వీట్
  • బీజేపీ ముఖ్యమంత్రా? లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రా? అంటూ కేటీఆర్ రీ-ట్వీట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ ముఖ్యమంత్రి? అంటూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీ-ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. పెట్టుబడుల సమీకరణలో భాగంగా నిన్న గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిశారు. వీటికి సంబంధించి 'మీటింగ్ విత్ ప్రధాని-బిజినెస్ విత్ అదానీ' అని క్యాప్షన్ పెట్టి... ప్రధాని మోదీతో, కరణ్ అదానీతో రేవంత్ రెడ్డి ఉన్న ఫొటోలను క్రిషాంక్ ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ... బీజేపీ ముఖ్యమంత్రా? లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రా? అని చురక అంటించారు.
Revanth Reddy
KTR
Narendra Modi
Gautam Adani
Telangana

More Telugu News