Team India: టీమిండియా ప్రతీకారం... ఒకటిన్నర రోజులోనే దక్షిణాఫ్రికా ఫినిష్

Team India takes revenge by beating South Africa in just one and half day
  • ముగిసిన రెండో టెస్టు
  • 79 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లకు ఛేదించిన టీమిండియా
  • సిరీస్ 1-1తో సమం
సఫారీ గడ్డపై తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా... రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో అద్భుత రీతిలో నెగ్గింది. తద్వారా దక్షిణాఫ్రికాపై ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ కేవలం ఒకటిన్నర రోజులోనే ముగిసింది. 

రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 12 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 28, కెప్టెన్ రోహిత్ శర్మ 17 (నాటౌట్), శుభ్ మాన్ గిల్ 10, విరాట్ కోహ్లీ 12, శ్రేయాస్ అయ్యర్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 1, నాండ్రే బర్గర్ 1, మార్కో యన్సెన్ 1 వికెట్ తీశారు.

ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకు ఆలౌట్ కాగా, టీమిండియా 153 పరుగులు చేసింది. అనంతరం, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 176 పరుగులు సాధించింది.
Team India
South Africa
2nd Test
Cape Town

More Telugu News