SKN: సినీ నిర్మాత ఎస్కేఎన్ కు పితృవియోగం... సంతాపం తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan express grief over SKN father demise
  • ఎస్కేఎన్ తండ్రి సూర్యప్రకాశరావు కన్నుమూత
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్న పవన్ కల్యాణ్
  • ఎస్కేఎన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ప్రకటన
సంచలన హిట్ చిత్రం 'బేబీ' నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు)కు పితృవియోగం కలిగింది. ఎస్కేఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశరావు కన్నుమూశారు. ఈ విషయం తెలిసి జనసేనాని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. నిర్మాత గాదె శ్రీనివాస కుమార్ తండ్రి గాదె సూర్యప్రకాశరావు కన్నుమూశారని తెలిసి చింతించానని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఎస్కేఎన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
SKN
Suryaprakash Rao
Demise
Pawan Kalyan
Tollywood

More Telugu News