MLA Sudhakar: జగన్ హీరోయిజం చూసే రాజకీయాల్లోకి వచ్చా: ఎమ్మెల్యే సుధాకర్

I came to politics after seeing Jagan heroism says MLA Sudhakar
  • కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కు ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం
  • జగన్ తప్పుకోమంటే తప్పుకుంటానన్న సుధాకర్
  • టికెట్ వస్తుందనే ఆశాభావంతోనే ఉన్నానని వ్యాఖ్య
వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందో, లేదో అనే టెన్షన్ లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రాఫ్ సరిగా లేని ఎమ్మెల్యేలను మొహమాటం లేకుండా సీఎం జగన్ పక్కన పెట్టేస్తుండటమే దీనికి కారణం. ఇప్పటికే పలువును సిట్టింగ్ లకు జగన్ 'నో' చెప్పేశారు. పలువురికి స్థానచలనం చేస్తున్నారు. ఈ మార్పులు, చేర్పులు వైసీపీ సిట్టింగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

మరోవైపు, కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కు కూడా ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.... జగన్ హీరోయిజం చూసే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆయన టికెట్ ఇస్తేనే, అదృష్టం కొద్దీ తాను ఎమ్మెల్యే అయ్యానని అన్నారు. జగన్ ఆదేశాల మేరకు శక్తివంచన లేకుండా ప్రజల కోసం కష్టపడ్డానని చెప్పారు. ప్రజల్లో తనకు అంత బాగోలేదని... అయినా, టికెట్ తనకే వస్తుందనే ఆశాభావంతో ఉన్నానని తెలిపారు. జగన్ తప్పుకో అని చెపితే, మరో ఆలోచన లేకుండా తప్పుకుంటానని అన్నారు. రాజకీయాల్లోకి ఎందరో వస్తుంటారని... పాలిటిక్స్ లో పోటీ ఉండటం సహజమేనని చెప్పారు. జగన్ తనకు ఏ బాధ్యతను అప్పగించినా పని చేస్తానని తెలిపారు. 
MLA Sudhakar
Kodumuru
Jagan
YSRCP

More Telugu News