Bengaluru: బెంగళూరుపై కరోనా పంజా.. భారీగా నమోదవుతున్న కొత్త కేసులు
- దేశ వ్యాప్తంగా 4,334 యాక్టివ్ కేసులు
- గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 298 పాజిటివ్ కేసులు
- ఒక్క బెంగళూరులోనే 172 కేసుల నమోదు
దేశ వ్యాప్తంగా క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశ ఐటీ రాజధాని బెంగళూరుపై కరోనా పంజా విసురుతోంది. దేశంలో ప్రస్తుతం 4,334 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో 298 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఒక్క బెంగళూరులోనే 172 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ప్రస్తుతం 1,240 యాక్టివ్ కేసులు ఉండటంతో రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
దేశంలో జేఎన్-1 సబ్ వేరియంట్ కేసులు 500 దాటాయి. ప్రస్తుతం దేశంలో 541 జేఎన్-1 కేసులు ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కర్ణాటకలో అత్యధికంగా 199, ఆ తర్వాత కేరళలో 148 కేసులు ఉన్నాయి. తెలంగాణలో 2 కేసులు ఉన్నాయి. మిజోరం, చండీగఢ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, మేఘాలయాలలో కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.