TS High Court: దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు
- ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపకూడదన్న పిటిషనర్ తరఫు న్యాయవాది
- ఆర్టికల్ 361 ప్రకారం పిటిషన్‌కు అర్హత లేదన్న గవర్నర్ తరఫు న్యాయవాది
- విచారణను జనవరి 23వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
గత ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు వేసిన పిటిషన్ మీద విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పిటిషన్‌కు విచారణార్హతపై తేలుస్తామని సీజే ధర్మాసనం శుక్రవారం తెలిపింది. తదుపరి విచారణను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అయితే గవర్నర్ సౌందరరాజన్ ఈ ఫైలును తిరస్కరించారు. దీంతో వీరిద్దరు హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదని పిటిషనర్లు కోర్టుకు వెల్లడించారు. అదే సమయంలో ఆర్టికల్ 361 ప్రకారం పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్ తరఫు న్యాయవాది... హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే హైకోర్టు విచారణను వాయిదా వేసింది.