BRS: ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: చేవెళ్ల ఎంపీ రంజిత్

MP Ranjith says we learned lessons from defeat
  • ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనన్న ఎంపీ రంజిత్
  • లోక్ సభ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించినట్లు వెల్లడి
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో... పాఠాలు నేర్చుకొని రానున్న లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అన్నారు. కానీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించుకున్నట్లు తెలిపారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతంలో తేడా 1.8 మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రైతుబంధు, రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు పదేపదే చెప్పారన్నారు. బీఆర్‌ఎస్ ఓటమిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తమ బలం.. బలగం కేసీఆర్ అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఇక ఎదురు లేదన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపు బీఆర్‌ఎస్‌దే అని ఆయన జోస్యం చెప్పారు.
BRS
ranjith reddy
chevella

More Telugu News