Vijayashanti: బీఆర్ఎస్ కు, కేసీఆర్‌కు తనదైన శైలిలో కొత్త అర్థాలు చెప్పిన విజయశాంతి

Vijayasanthi new meanings for BRS and KCR
  • బీఆర్ఎస్ అంటే భవిష్యత్ రహిత సమితి అని విజయశాంతి ట్వీట్
  • కేసీఆర్ అంటే కోతి చేష్టల రాజ్యం అంటూ చురక
  • రాములమ్మ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్
బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి కొత్త అర్థం చెప్పారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అని మనకందరికీ తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అంటే భవిష్యత్ రహిత సమితి అని రాములమ్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. దీనిని కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ రీట్వీట్ చేసింది. 

'భవిష్యత్ రహిత సమితి (#BRS) నాయకత్వం అధికారం లేకుంటే అసలు బతకలేని స్థితికి చేరుకున్నట్లు కనబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు ఒక వైపు దశలవారీగా చేస్తుండగానే, 30 రోజులు కాకముందే 420 అంటూ విమర్శిస్తూ పుస్తకం ప్రచురించారు బీఆర్ఎస్ వైపు నుండి. అదికూడా దుర్మార్గ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ నెత్తిన 6 లక్షల కోట్లు అప్పు పెట్టిన అంశం వారే సిగ్గులేక యాదిమరిచి.. 
నిజానికి గత సుమారు 10 ఏండ్ల బీఆర్ఎస్ మోసపు, అసత్యపు, అమలు చేయని హామీలు, అవినీతి, అరాచకాల గురించి, #K_కోతి_C_చేష్టల_R_రాజ్యం (#కేసిఆర్) పరిపాలన గురించి పుస్తకాలు ప్రచురిస్తే  అది ఒక  గ్రంథాలయానికి చాలచ్చు బహుశా...' అని ట్వీట్ చేశారు. దీనిని కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.
Vijayashanti
Congress
BRS
KCR

More Telugu News