Geetham University: హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో బీటెక్‌ విద్యార్థిని సూసైడ్

A BTech student committed suicide in Geetham University in Hyderabad
  • కాలేజీ భవనం ఐదో అంతస్తు నుంచి దూకిన రేణుశ్రీ అనే విద్యార్థిని
  • ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కిందికి దూకడంతో మృతి
  • కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు
సంగారెడ్డి జిల్లా రుద్రారం పరిధిలోని గీతం విశ్వవిద్యాలయంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఎం.రేణుశ్రీ (18) అనే బీటెక్ విద్యార్థిని కాలేజీ ప్రాంగణంలోనే ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భవనం ఐదో అంతస్తు ఎక్కిన రేణుశ్రీ ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతూనే ఒక్కసారిగా పైనుంచి కిందికి దూకింది. దీంతో ఆమె చనిపోయింది. రేణుశ్రీని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 

కాగా ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే పటాన్‌చెరు పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రేణుశ్రీ మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టినట్టు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కాగా హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని శిల్పాబృందావన్‌ కాలనీ ఎల్లమ్మబండకి చెందిన ఎం.రేణుశ్రీ బీటెక్‌(సీఎస్సీ) మొదటి సంవత్సరం చదువుతుంది. 
Geetham University
Hyderabad
Suicide
Telangana

More Telugu News