Congress: గత ప్రభుత్వం ప్రజలను ట్రాఫిక్ ఇబ్బందుల్లోకి నెట్టింది: ఫార్ములా రేస్‌పై కాంగ్రెస్ నేత నిరంజన్
- ఫార్ములా రేస్ కారణంగా భాగ్యనగరవాసులు గతంలో ఇబ్బందిపడ్డారని వ్యాఖ్య
- ఇప్పుడు ఫార్ములా రేస్‌కు అనుమతి ఇవ్వకపోవడంపై హర్షం వ్యక్తం చేసిన నిరంజన్
- ఫార్ములా రేస్‌కు అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తోందని వెల్లడి
ఫార్ములా రేస్ విషయంలో గత ప్రభుత్వం ప్రజలను ట్రాఫిక్ ఇబ్బందుల్లోకి నెట్టే అవివేక నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నేత నిరంజన్ విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫార్ములా రేస్ కారణంగా భాగ్యనగర వాసులు గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇప్పుడు ఫార్ములా రేస్ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ట్రాఫిక్‌ను స్తంభింపచేసి గత ప్రభుత్వం అవివేక నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకొని అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ రేస్ వల్ల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదన్నారు. ఫార్ములా రేస్ వల్ల పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ చెప్పడం తెలివి తక్కువతనమన్నారు. ఫార్ములా రేస్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని తెలిపారు.