sajjanar: ఆర్టీసీ వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్న సజ్జనార్

Sajjanar participated in Vana Bhojana programme
  • వనభోజనాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్న సజ్జనార్
  • ఉద్యోగులంతా స్నేహపూర్వక వాతావరణంలో వనభోజనాలు నిర్వహించుకోవడం శుభపరిణామమన్న సజ్జనార్
  • టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కష్టపడి పని చేస్తున్నారని కితాబు
టీఎస్ఆర్టీసీ మియాపూర్ డిపో 2లో శనివారం వనభోజనాలు నిర్వహించారు. ఈ వనభోజనాలకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ హాజరయ్యారు. విధి నిర్వహణలో అద్భుతంగా పని చేస్తున్న పలువురు ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ... టీఎస్ఆర్టీసీలో వనభోజనాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.

ఉద్యోగులంతా కలిసి స్నేహపూర్వక వాతావరణంలో వనభోజనాలు నిర్వహించుకోవడం మంచి పరిణామమన్నారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులంతా కష్టపడి పని చేస్తున్నారని కితాబునిచ్చారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని... ఈ ప్రతిష్టాత్మక పథకం అద్భుతంగా అమలవుతోందన్నారు. మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్ గుర్తుంపు కార్డు తీసుకొని సిబ్బందికు సహకరించాలని కోరారు.
sajjanar
tsrtc
Telangana

More Telugu News