Anganwadi Workers: ఏపీలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు

Teachers associations extends support to Anganwadi workers
  • డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన అంగన్వాడీలు
  • ఎస్మా ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం
  • అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించిన ఉపాధ్యాయ సంఘాలు
ఏపీలో గత కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీలు ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు చేపట్టడం నిషేధం అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తమపై ఎస్మా ప్రయోగించడం పట్ల అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె చేస్తామని స్పష్టం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, ఏపీ ఉపాధ్యాయ సంఘాలు అంగన్వాడీలకు మద్దతు తెలిపాయి. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగాన్ని ఖండిస్తున్నామని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు. సమస్య పరిష్కరించాలంటే ఎస్మా విధిస్తారా? అంటూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రశ్నించింది. అంగన్వాడీలపై ఎస్మాను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Anganwadi Workers
Strike
Teachers
Andhra Pradesh

More Telugu News