Chandrababu: జగన్ పాలనకు చరమగీతం పాడాలి: చంద్రబాబు

TDP Chief Chandrababu Speech At Tiruvuru Sabha
  • తిరువూరులో ‘రా కదలిరా’ సభలో టీడీపీ అధినేత ప్రసంగం
  • వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వ్యాఖ్య
  • ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆంకాక్ష అని వెల్లడి
అసమర్థుడి పాలనలో రాష్ట్రం కొంతవరకు నష్టపోతుంది కానీ దుర్మార్గుడు పాలకుడైతే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితే అందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. ఈమేరకు తిరువూరులో జరుగుతున్న ‘రా కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు.

‘జగన్‌ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. హైదరాబాద్‌ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయింది. ప్రజాస్వామ్యంలో నిద్రలేని కాలరాత్రులు గడిపాం. ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాలి’’ అని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ‘రా కదలిరా’ అంటూ  ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలుగుజాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ తోడ్పడిందని, తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారని, ధాన్యం రైతులు దగాపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని విచారం వ్యక్తం చేశారు.

Chandrababu
Raa kadalira
Tiruvuru Sabha
TDP Chief

More Telugu News